**వాళ్లని బహిరంగంగా ఉరితీయాలి: జయాబచ్చన్‌**

వాళ్లని బహిరంగంగా ఉరితీయాలి: జయాబచ్చన్‌_


_దిల్లీ: దిషా హత్య ఘటన రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ ఘటనను సభ్యులు తీవ్రంగా ఖండించారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. 'ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న వారిని ఎటువంటి క్షమాభిక్ష లేకుండా బహిరంగంగా ఉరి తీయాలి. దీనికి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలంటూ ప్రజలు నిలదీయాల్సిన సమయం ఇదే. నిర్భయకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు' అని ఆమె అన్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్‌ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు లోక్‌సభలోనూ దిషా హత్య ఘటనపై చర్చ జరుగుతోంది._